Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోడీకి ఆకాశం కూడా హద్దు కాదు.. ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ టైసన్

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని పలు రంగాలకు  చెందిన ప్రముఖులు కలుస్తున్నారు. 

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని పలు రంగాలకు  చెందిన ప్రముఖులు కలుస్తున్నారు. న్యూయార్క్‌లో ప్రధాని మోదీ.. పలువురు ప్రముఖలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ టైసన్ సమావేశమై చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం టైసన్ మాట్లాడుతూ. ప్రధాని మోదీకి ఆకాశమే హద్దు కాదని అన్నారు. చాలా మంది ప్రపంచ నాయకులకు ప్రాధాన్యతలు బ్యాలెన్స్‌లో ఉండకపోవచ్చు..  కానీ ప్రధాని మోదీ మాత్రం పరిష్కారాలతో సహా అనేక విషయాలపై శ్రద్ధ వహిస్తారని తెలిపారు. భారతదేశం సాధించగలిగే శక్తికి పరిమితి లేదు.. ఇలా చెబుతున్నది తాను ఒక్కడినే కాదని అన్నారు.

Video Top Stories