Asianet News TeluguAsianet News Telugu

పోలీసు జాత్యహంకారం: ట్రంప్ కు బంకర్ చూపిన నల్లసూర్యుళ్లు

ఒక వైపు కరోనా ,మరో వైపు అధక్ష్య ఎన్నికలు తో  సతమత మవుతున్న ట్రంప్ కి  ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు  తల పట్టుకునే  స్థితికి వచ్చినట్టు అయింది .

ఒక వైపు కరోనా ,మరో వైపు అధక్ష్య ఎన్నికలు తో  సతమత మవుతున్న ట్రంప్ కి  ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు  తల పట్టుకునే  స్థితికి వచ్చినట్టు అయింది .ఎప్పుడు వివాదాస్పద నిర్ణయాలతో  ప్రజల విమర్శలలో వుండే ట్రంప్ ,కరోనా విలయంతో అమెరికాలో లక్ష ఏడు వేలమంది  మరణించడానికి  అతని నిర్ణయాలే కారణమనేది   మరో విమర్శ .అమెరికాలో  దాదాపు 150 నగరాలలో కర్ఫ్యూ వున్నా నిషేదాజ్ఞలు  లెక్కచేయకుండా  వేలసంఖ్యలో ప్రజలు రోడ్ల పైకి వచ్చి  ఆందోళనలు  చేస్తున్నారు అంటే అక్కడి పరిస్థితి అంచనావేయవచ్చు .శ్వేతా జాతి అమెరికా పోలీస్ చేతిలో ఆఫ్రో అమెరికన్ జార్జి  ప్లాయిడ్  మృతి చెందిన తీరుతో  ఆగ్రహ జ్వాలలు వెలువెత్తాయి .గత కొన్ని శతాబ్దాలుగా అమెరికాలో జాతి వివక్ష ఆందోళనలు జరుగుతూనే వున్నాయి .