ఆటా పాటలతో ఫిక్నిక్ స్పాట్ ను తలపిస్తున్న శ్రీలంక అధ్యక్ష భవనం
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదిరి ప్రజాగ్రహం పెల్లుబకడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదిరి ప్రజాగ్రహం పెల్లుబకడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. రాజపక్సే కుటుంబపాలనపై తిరుగుబాటుకు దిగిన ప్రజలు దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటిపై దాడికి దిగారు. అయితే గొటబాయ దేశంవిడిచి పరారవడంతో ప్రస్తుతం అధ్యక్ష భవనం ఫిక్నిక్ స్పాట్ ను తలపిస్తోంది. దేశ ప్రజలు పిల్లాపాపలతో అధ్యక్ష భవనం వద్దకు చేరుకుని పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ వీధుల్లో వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు. భారీగా యువతీ యువకులు, చిన్నారులు, పెద్దల సందడితో శ్రీలంక అధ్యక్ష భవనం వద్ద కోలాహలం నెలకొంది.