మోడీ అమెరికా ఈవెంట్: భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ రాక..(వీడియో)
ఈ నెల 22వ తేదీన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో మన ప్రధాని నరేంద్రమోడీ పాల్గొననున్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా 50వేల మంది భారతీయ అమెరికన్లు ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ గత రెండు పర్యాయాల సభల కన్నా ఇది చాలా పెద్దది.

నిన్న ఆదివారం నాడు వైట్ హౌస్ ఒక ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సభకు హాజరవ్వనున్నట్టు తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ట్విట్టర్లో ఈ పరిణామాన్ని స్వాగతించాడు. ఇంత భారీ సంఖ్యలో భారతీయ అమెరికన్లను ఒకే చోట ఉద్దేశించి ప్రసంగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెకార్డులకెక్కనున్నాడు.