విశ్వగురు భారత్ కు అద్భుత అవకాశం... G20 అధ్యక్ష బాధ్యతలు ప్రధాని మోదీకి

ఇండోనేషియా : అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జీ20 దేశాల సదస్సుకు వచ్చేఏడాది భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది (2022) G20 శిఖరాగ్ర సదస్సుకు ఇండోనేషియాలో జరిగింది. 

First Published Nov 17, 2022, 11:55 AM IST | Last Updated Nov 17, 2022, 11:55 AM IST


ఇండోనేషియా : అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జీ20 దేశాల సదస్సుకు వచ్చేఏడాది భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది (2022) G20 శిఖరాగ్ర సదస్సుకు ఇండోనేషియాలో జరిగింది. బాలీలో జరిగిన ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తో పాటు 20దేశాల అధినేతలు పాల్గొన్నారు. బుధవారం ఈ సదస్సు ముగియగా తదుపరి 2023లో భారత్ లో ఈ సదస్సు జరగనున్న నేపథ్యంలో అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ప్రధాని మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో G20 అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.