Asianet News TeluguAsianet News Telugu

video : వీసా లేకుండా పాకిస్తాన్ ప్రయాణం

పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ ను సందర్శించే భారతీయ యాత్రికుల నుండి యేటా 258కోట్ల ఆదాయం పొందవచ్చని అంచనా వేస్తోంది. పాకిస్తానీ కరెన్సీలో ఇది 571 కోట్లు. పాకిస్తాన్ కర్తార్ పూర్ లోని దర్బార్ సాహిబ్ ఇది సిక్కుల మతగురువు గురునానక్ చివరి విశ్రాంతి స్థలం.

పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ ను సందర్శించే భారతీయ యాత్రికుల నుండి యేటా 258కోట్ల ఆదాయం పొందవచ్చని అంచనా వేస్తోంది. పాకిస్తానీ కరెన్సీలో ఇది 571 కోట్లు. పాకిస్తాన్ కర్తార్ పూర్ లోని దర్బార్ సాహిబ్ ఇది సిక్కుల మతగురువు గురునానక్ చివరి విశ్రాంతి స్థలం. 

పాకిస్తాన్, కర్తార్ పూర్ లోని గురుద్వార్ దర్బార్ సాహెబ్ ని దర్శించుకోవడానికి రోజుకు ఐదువేలమంది యాత్రికులను అనుమతిస్తారు. సేవా రుసుము కింద ఒక్కొక్కరి నుండి 20 డాలర్లు వసూలు చేస్తారు. అలా రోజు లక్ష డాలర్ల ఆదాయం వస్తోంది.

పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక మాంధ్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమయంలో ఈ సేవా రుసుము పాకిస్తాన్ కి ఊరటగా మారిందనే చెప్పాలి. విదేశీ కరెన్సీని తెచ్చిపెట్టే అతి ముఖ్యమైన మార్గం యాత్రికుల నుండి వసూలు చేసే ఈ సేవారుసుమే. 

భారతీయ యాత్రీకుల కోసం ఇండియా పాకిస్తాన్ తో అక్టోబర్ 23 న ఒక ఒప్పందం మీద సంతకం చేయనుంది. కర్తార్ పూర్ కారిడార్ లో భారతీయ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, భవిష్యత్తులో సేవా రుసుము విషయంలో పునరాలోచించాలని ఇస్లామాబాద్ ను కోరనుంది.

నవంబర్ 9న మొదటి బ్యాచ్ భారతీయ యాత్రికులు కర్తార్ పూర్ వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సిక్కు మత సైట్లలో జరుగుతోంది. అయితే ఫీజు రుసుములో ఉన్న ఈ తేడాల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.

గురుద్వార్ దర్బార్ సాహెబ్ కర్తార్ పూర్ బార్డర్ కారిడార్ లో ఉంది. ఈ ప్రాంతం మొత్తం విస్తీర్ణం నాలుగుకిలోమీటర్లు. ఈ నాలుగు కిలోమీటర్ల ప్రాంతంలో భారత యాత్రికులు వీసా లేకుండా ప్రయాణించేందుకు భారత్, పాకిస్తాన్ లు ఆమోదం తెలిపాయి. దీంతో పక్కదేశంలో ఉన్న దర్బార్ సాహెబ్ ను సందర్శించే యాత్రికులు కేవలం తమ పాస్ పోర్టులు వెంట తీసుకువెడితేచాలు.   

రోజుకు ఐదువేలమంది యాత్రికులను అనుమతించేలా ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ప్రత్యేక సందర్భాల్లో ఇంకా ఎక్కువమందిని అనుమతిస్తారు. పాకిస్తాన్ యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, మరిన్ని సౌకర్యాలు పెంచాలని భారత్ కోరింది.

అయితే 20 డాలర్ల ఫీజు రుసుము భారత్ లో కొంత కలహాలకు కారణమవుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ ఖౌర్ బాదల్ లు ఈ ఫీజును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Video Top Stories