రాజపక్సే రాజీనామా... సంబరాలు చేసుకుంటున్న లంకేయులు
శ్రీలంక అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్సే రాజీనామా చేశారు.
శ్రీలంక అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్సే రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి సింగపూర్ కు చేరుకున్న అనంతరం తన రాజీనామా లేఖను స్పీకర్ మహీందా అభియవర్ధినేకు పంపారు. కాగా.. గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవడంతో అక్కడ నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గోటబయ రాజపక్స రాజీనామా చేసిన వెంటనే అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆడుతూ,పడుతూ సంబరాలు చేసుకుంటున్నారు..!