Asianet News TeluguAsianet News Telugu

యురోపియన్ యూనియన్ లో ఎన్సార్సీ వ్యతిరేక తీర్మానాలు

పౌరసత్వ సవరణ చట్టం మీద యూరోపియన్ పార్లమెంటులోని ఐదు రాజకీయ సమూహాలు సంయుక్త  తీర్మానం చేశాయి. 

పౌరసత్వ సవరణ చట్టం మీద యూరోపియన్ పార్లమెంటులోని ఐదు రాజకీయ సమూహాలు సంయుక్త తీర్మానం చేశాయి. దీని ప్రకారం పౌరసత్వ సవరణ చట్టం అనేది ప్రకృతి విరుద్ధమని, వివక్షతో 
కూడుకున్నదని, ఇది దేశాన్ని చాలా ప్రమాదకరంగా విభజిస్తుందని తేల్చింది. అంతేకాదు చట్టం ముందు అందరూ సమానులే అనేది భారతదేశానికి బలం అని కానీ ఈ చట్టం ఆ బలాన్ని బలహీనపరుస్తుందని చెప్పింది. ఎన్నార్సీ వల్ల దేశప్రజల్లో మత అసహనం, వివక్షకు ఆజ్యం పోయడం వల్ల దేశంలో జెనోఫోబియా పెచ్చుమీరిపోతుందని వారు చెబుతున్నారు.