Asianet News TeluguAsianet News Telugu

కెనడా ప్రధాని భార్యకు కరోనా పాజిటివ్..భార్యకోసం ప్రధాని వర్క్ ఫ్రం హోం...

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. లండన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగివచ్చిన తరువాత సోఫీ గ్రెగోర్‌లో ఫ్లూ లక్షణాలు కనిపించాయి. పరీక్షల్లో ఆమెకు కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. అయితే జస్టిన్ ట్రుడోకు మాత్రం ఆ లక్షణాలు లేవు. అయితే భార్య కరోనా బారినపడటంతో కెనడా ప్రధాని ట్రుడో తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇంటి నుంచే పనిచేస్తున్నారు.