కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ కృషి భేష్ ... ప్రధాని మోడీతో భేటీ అనంతరం ప్రముఖ రచయిత నసీం నికోలస్ టాలెబ్

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని పలు రంగాలకు  చెందిన ప్రముఖులు కలుస్తున్నారు. 

First Published Jun 21, 2023, 10:25 AM IST | Last Updated Jun 21, 2023, 10:25 AM IST

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని పలు రంగాలకు  చెందిన ప్రముఖులు కలుస్తున్నారు. న్యూయార్క్‌లో ప్రధాని మోదీ.. పలువురు ప్రముఖలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోడీతో ప్రముఖ రచయిత, తత్వవేత్త, మాథమెటిషన్ నసీం నికోలస్ టాలెబ్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో భరత్ కృషిని మెచ్చుకున్నానని అన్నారు. రిస్క్ తీసుకోవడం, యాంటీ-ఫ్రెజిలిటి గురించి కూడా చర్చించినట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.