Asianet News TeluguAsianet News Telugu

వైరస్ లతో వణుకు పుట్టిస్తున్న చైనా.. ఇప్పుడు బుబోనిక్ ప్లేగ్..

మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసే వైరస్ లు, రోగాలకు చైనా కేరాఫ్ గా మారుతోంది. 

మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసే వైరస్ లు, రోగాలకు చైనా కేరాఫ్ గా మారుతోంది. కొత్త కొత్త వైరస్ లన్నీ చైనాలోనే పురుడు పోసుకుంటున్నాయి. ఇప్పటికే చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా, యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఈ వైరస్ నుంచి కోలుకోకముందే కొత్త వైరస్ లు చైనాలో బయటపడ్డాయి. మొన్న కరోనా, నిన్న జీ-4, నేడు బుబోనిక్ ప్లేగ్.. ఇలాంటి భయంకర వ్యాధులతో చైనా వైరస్ ల దేశంగా మారింది. ఇప్పటికే కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం అల్లకల్లోలంగా మారింది. అది మరువక ముందే జీ-4 అనే కరోనాను మించిన వైరస్ కూడా తమ దేశంలో ఉన్నట్లు ఇటీవలే ప్రకటించి మానవాళికి షాక్ ఇచ్చారు చైనా పరిశోధకులు. ఇప్పుడు కరోనా, జీ-4ను మించిన మహమ్మారి మరొకటి తమ దేశంలో ఉందని ప్రకటించి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది చైనా.