సంఘ సంస్కరణే జీవితాశయంగా బ్రతికిన మహనీయుడు - వైకుండ స్వామి
అగ్రకులం, మతం ఆధిపత్యం, మహిళలపై అణచివేత, విదేశీ పాలనకు వ్యతిరేకంగా, స్వదేశీ పాలకుల అరాచకాలు.. వీటన్నింటినీ ప్రశ్నించినవారు ఉన్నారా?
అగ్రకులం, మతం ఆధిపత్యం, మహిళలపై అణచివేత, విదేశీ పాలనకు వ్యతిరేకంగా, స్వదేశీ పాలకుల అరాచకాలు.. వీటన్నింటినీ ప్రశ్నించినవారు ఉన్నారా? అంటే చాలా అరుదనే చెప్పాలి. అందులో కచ్చితంగా అయ్య వైకుండార్ స్వామి ఉంటారు. అప్పటి సమాజానికి కనీసం స్పృహ లేని హక్కుల గురించి అణచివేత గురించి ఆయన గళమెత్తారు.
వైకుండా స్వామి కూడా అని పిలిచే ఆ సంఘ సంస్కర్త కన్యాకుమారి సమీపంలో ఓ చిన్న గ్రామంలో నిమ్న కులం చన్నార్ కుటుంబంలో 19వ శతాబ్దంలో జన్మించారు. తిరువితంకూర్‌లో వెనుకబడిన కులాల మహిళల ఛాతిపైనా ఏ ఆచ్ఛాదనను అంగీకరించిన కాలం అది. వైకుండ స్వామికి తల్లిదండ్రులు ఓ హిందూ దేవుడి పేరు పెట్టినందుకు అగ్ర కులాల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. దీంతో ముత్తుకుట్టీ అని పేరు మార్చారు.
20వ ఏట వైకుండ స్వామి అనారోగ్యానికి గురైనప్పుడు తిరుచెండూర్‌లోని మురుగ టెంపుల్ తీసుకెళ్లారు. అక్కడే ఆయన అన్ని మతాల గ్రంథాలు తిరగేశాడు. అక్కడే ఆయనకు జ్ఞానోదయం అయిందని చెబుతుంటారు. దీంతో ఆయనకు పెద్ద సంఖ్యలో భక్తులు ఏర్పడ్డారు. ఆయన అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడాడరు. సమత్వా సమాజ్‌ను స్థాపించారు. మతం, కులం, వర్గం, ఆడ మగా తేడాలకు అతీతంగా మనుషులందరినీ సమానంగా గౌరవించాలని బోధించారు. బావులు తవ్వించి అన్ని కులాల వారికి నీరు తోడుకోవడానికి అనుమతించారు. జంతు బలులను వ్యతిరేకించారు. విగ్రహారాధనను నిరాకరించారు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 19వ శతాబ్దంలో నిమ్న కులాల మహిళలు తమ ఛాతిని వస్త్రంతో కప్పుకోవడానికి జరిపిన ఉద్యమంలో ఆయన పాత్ర ఉన్నది.
పెద్ద కులాల సాంప్రదాయాలకు భంగం కలిగిస్తున్నాడని ఫిర్యాదులు పెరగడంతో తిరువితంకూర్ మహారాజ స్వాతి తిరునాల్ ఆయనను 110 రోజులు తిరువనంతపురంలో నిర్బంధించారు. దేశాన్ని పాలిస్తున్న ఇంగ్లీషువారు తెల్ల దెయ్యాలు అయితే.. తిరువితంకూర్ మహారాజ నల్ల దేవుడు అని నిరసించారు. అన్ని కులాల్లోని తప్పుడు ఆచారాలను వ్యతిరేకించారు. మరో సంఘ సంస్కర్త నారాయణ గురు, చట్టాంబి స్వామిల గురువు థాయ్‌కాడ్ అయ్యగారు.. ఈయన అనుచరుడే.