Asianet News TeluguAsianet News Telugu

హిందూ ముస్లిం ఐక్యత కోసం అమరుడైన మహనీయుడు... గణేష్ శంకర్ విద్యార్థి.

భార‌త స్వాతంత్య్రం కోసం పోరాడాడు.. హిందూ ముస్లి ఐక్య‌త కోసం అమ‌రమీరుడ‌య్యాడు.

భార‌త స్వాతంత్య్రం కోసం పోరాడాడు.. హిందూ ముస్లి ఐక్య‌త కోసం అమ‌రమీరుడ‌య్యాడు. కాన్పూర్ సింహంలా పేరు సంపాదించుకున్న ఆయ‌న ఏవ‌రోకాదు స్వాతంత్య్ర పోరాటం, అణగారిన ప్రజల గొంతుక‌గా ఉన్న ప్రతాప్ హిందీ ప్రచురణకు వ్యవస్థాపక సంపాదకుడైన గణేష్ శంకర్ విద్యార్థి.  గణేష్ శంకర్ 1890లో అలహాబాద్ సమీపంలోని ఫతేపూర్‌లో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆయ‌న పాఠశాల విద్య అభ్యాస‌న స‌మ‌యంలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. పని చేయడం ప్రారంభించాడు. జ‌ర్న‌లిజం రంగంలోకి ప్ర‌వేశించి.. 16 సంవత్సరాల వయస్సులో తన మొదటి పుస్తకాన్ని ప్రచురించాడు. కర్మయోగి, స్వరాజ్య వంటి శక్తివంతమైన జాతీయవాద పత్రికలతో ఆయ‌న సంబంధాలున్నాయి. గణేష్ తన శక్తివంతమైన కథనాలను రాయడానికి ఎంచుకున్న కలం పేరు విద్యార్థి. 21 సంవత్సరాల వయస్సులో, విద్యార్థి హిందీ జర్నలిజం డోయెన్ మహావీర్ ప్రసాద్ ద్వివేది నేతృత్వంలోని ప్రసిద్ధ సాహిత్య ప్రచురణ అయిన సరస్వతిలో చేరారు. కానీ విద్యార్థి రాజకీయ జర్నలిజానికి దూరంగా ఉండలేకపోయాడు. 1913లో అతను ప్రతాప్‌ను స్థాపించాడు. ఇది దేశ స్వాతంత్య్రం మాత్రమే కాకుండా షెడ్యూల్డ్ కులాలు, మిల్లు కార్మికులు, రైతులు, హిందూ ముస్లిం సామరస్యం కోసం విప్లవాత్మక జర్నలిజంలో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆయ‌న బోల్డ్ జ‌ర్న‌లిజం కార‌ణంగా అనేక కేసుల‌ను ఎదుర్కొవ‌డంతో పాటు జైలు శిక్ష‌లు సైతం అనుభ‌వించారు. 1916లో విద్యార్థి గాంధీని కలిసి.. స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా  పాల్గొన్నారు. కాన్పూర్ లో మొదటి మిల్లు కార్మికుల సమ్మెను నిర్వహించాడు. ఆయ‌న సంచలన ప్రసంగం నేప‌థ్యంలో విద్యార్థిపై దేశద్రోహం కేసు నమోదుతో జైలు శిక్ష‌ను అనుభ‌వించాడు. జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత‌.. భగత్ సింగ్, ఇతర సహచరులను కలుసుకుని వారికి సన్నిహిత మిత్రుడు అయ్యాడు. 1926లో కాన్పూర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ త‌ర్వాత‌ ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు. ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించినందుకు విద్యార్థిని 1930లో మళ్లీ అరెస్టు చేశారు. పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్‌ పార్టీని సమూలంగా మార్చేశారన్నారు. ఖాదీని ప్రచారం చేసేందుకు నార్వాల్‌లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. 1931లో కాన్పూర్‌లో హిందూ-ముస్లింల మధ్య హింసాత్మక మత ఘర్షణలు చెలరేగాయి. పోరాడుతున్న వర్గాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు విద్యార్థిని ఈ గొడవల మధ్యలోకి దూకి, గుర్తు తెలియని దుండగుల చేతిలో కత్తి దాడికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న‌ హత్య వెనుక బ్రిటిష్ అధికారులు నియమించిన గుండాలప‌నేన‌ని ఆయ‌న కుటుంబం విశ్వసించింది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి, భగత్ సింగ్ వంటి విప్లవకారులకు వారధి. "విద్యార్థి రక్తం హిందువులు-ముస్లింల మధ్య సంబంధాలను సుస్థిరం చేస్తుంది" అని గాంధీజీ చెప్పారు.