కాలికట్ లో పోర్చుగీస్ కి సింహస్వప్నంలా ఎదురు నిలిచిన కుంజాలి మరక్కర్లు

కోర‌మండ‌ల్ తీర‌ప్రాంతాల్లో ప్రోర్చుగీసు వారిని ఎదురించి.. న‌డిసంద్రంలో వారిపై భీక‌రదాడులు చేసిన భార‌త యోధుల‌లో మొద‌ట‌గా చేప్పుకునే వారిలో మ‌ర‌క్క‌ర్లు ముందుంటారు.

First Published Jul 3, 2022, 11:48 AM IST | Last Updated Jul 3, 2022, 11:48 AM IST

కోర‌మండ‌ల్ తీర‌ప్రాంతాల్లో ప్రోర్చుగీసు వారిని ఎదురించి.. న‌డిసంద్రంలో వారిపై భీక‌రదాడులు చేసిన భార‌త యోధుల‌లో మొద‌ట‌గా చేప్పుకునే వారిలో మ‌ర‌క్క‌ర్లు ముందుంటారు. కోరమండల్ తీరంలోని  నాగపట్నంలో మరక్కర్ల మూలాలు ఉన్నాయి. వీరు 15-16వ శతాబ్దాలలో తూర్పు  ప్రాంతం నుంచి మలబార్, సిలోన్‌తో వాణిజ్యాన్ని నియంత్రించారు. 16వ శతాబ్దం నాటికి మ‌ర‌క్క‌ర్ల‌లో ఒక సమూహం మొదట కొచ్చికి, అటునుంచి కోజికోడ్‌కు వలస వచ్చింది. కోజికోడ్‌కు చెందిన సమూతిరి రాజా వారిని తన నౌకాదళ కమాండర్‌లుగా, ఎర్ర సముద్రపు ఓడరేవులతో విదేశీ మిరియాలు వ్యాపార నిర్వాహకులుగా నియమించుకున్నాడు. మ‌ర‌క్క‌ర్లు కేవ‌లం వాణిజ్యంలోనే కాకుండా న‌డి సంద్రంలో శ‌త్రునౌక‌ల‌పై మెరుపుదాడులు చేయ‌డంలో మంచి ప్రావీణులు. వీరి సేవ‌ల‌ను గుర్తించి కుంజలి మరక్కర్స్ అనే బిరుదును కూడా ప్రదానం చేశారు.

మరక్కర్లు పోర్చుగీసు పూర్వపు వ్యాపార మిత్రులు. కాల‌క్ర‌మంలో వీరు బద్ధ శత్రువులుగా మారారు. కుంజలిలు పోర్చుగీసుకు వ్యతిరేకంగా సమూతిరి ప్రతిఘటనల్లో ముందున్నారు. ఎన్నోసార్లు వారిని ఎదురించి ముందుకుసాగారు. కానీ 16వ శతాబ్దపు చివరి సంవత్సరాలలో సమూతిరి మరియు కుంజలిలు విడిపోయారు. కుంజలిల అపూర్వమైన శక్తి, సంపదను చూసి సామూతిరి ఆందోళన గుర‌య్యాడు. ఈ క్ర‌మంలోనే పోర్చుగీసువారు కుంజలీకి వ్యతిరేకంగా సమూతిరితో ఒప్పందం కుదుర్చుకున్నారు. పోర్చుగీస్,  సమూతిరిల సంయుక్త దాడిలో కుంజలిని ఓడించాడు. శత్రువును పట్టుకుని గోవాకు తీసుకెళ్లి బహిరంగంగా ఉరితీశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, అతని తలను మలబార్‌కు తీసుకువచ్చి ప్రదర్శించి ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌ను భయభ్రాంతులకు గురిచేశారు. మలబార్ ప్రజల మధ్య ఉన్న అనైక్యత ఆక్రమణదారులకు కలిసివచ్చిన ఘటన ఇది..