స్వతంత్ర సంగ్రామంలో అధిక సంఖ్యలో పాల్గొన్న బహుజనులు...
1857 మొదటి భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది భారతీయ రాజులు, రాణిలు, నవాబులు, బేగంల పోరాటాల గురించి అందరికీ తెలుసు కానీ.. ఇటీవలి కాలంలో జరిపిన కొన్ని అధ్యయనాలు వెనుకబడిన కులాల సమూహాలు, అనేక మంది వీరవనితలు సైతం ఆ తిరుగుబాటులో పాలుంపచుకున్నారని వెల్లడించాయి.
1857 మొదటి భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది భారతీయ రాజులు, రాణిలు, నవాబులు, బేగంల పోరాటాల గురించి అందరికీ తెలుసు కానీ.. ఇటీవలి కాలంలో జరిపిన కొన్ని అధ్యయనాలు వెనుకబడిన కులాల సమూహాలు, అనేక మంది వీరవనితలు సైతం ఆ తిరుగుబాటులో పాలుంపచుకున్నారని వెల్లడించాయి. ఇన్నాళ్లూ వారు జానపద కథలు-ఇతిహాసాలలో వారి పోరాటాలు కనిపించాయి. ఇలాంటి కోవకు చెందిన బహుజన వీరవనితల్లో రాణి అవంతీ బాయి, మహాబిరి దేవి, ఝల్కారీ దేవి, ఉదా దేవి, ఆశాదేవిలు ఉన్నారు. అవంతీ బాయి.. రామ్ గర్ఘ్ లోధి రాజపుత్ రాణి. మహాబిరి అత్యల్ప వర్గానికి చెందిన భంగిస్ కులానికి చెందినది. ఝల్కారి దేవీ కోరి కులానికి చెందినవారు. ఉదా దేవి ఒక పాసి. ఆశాదేవి ఒక గుర్జారీ.. ఇలా అందరూ కుల సోపానక్రమంలో తక్కువ వర్గాలకు చెందినవారు.
నేటి మధ్యప్రదేశ్‌లోని రామ్‌ఘర్‌కు చెందిన రాజా విక్రమాదిత్య లోధి భార్య అవంతి బాయి. రాజ్యంలో పరిపాలనాపరమైన, సైనిక వ్యవహారాలలో ఆమె ప్రవీణురాలు. 1857లో తిరుగుబాటు జరిగినప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నులు చెల్లించవద్దని అవంతి తన ప్రజలను కోరింది. బ్రిటీష్ అణచివేత సమయంలో అవంతి 4000 మంది సైన్యాన్ని బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ముందుకు నడిపించింది. కంపెనీ అవుట్‌పోస్టులపై దాడి చేసి అనేక మందిని చంపింది. బ్రిటీష్ సేనలు చుట్టుముట్టిన సమయంలో తన కత్తితో ప్రానాలు తీసుకుంది.
మహాబిరి ఉత్తరప్రదేశ్‌లోని ముసఫర్‌నగర్‌లో భంగి కులంలో జన్మించారు. ఆమె చిన్నతనం నుంచే తెలివైన- ధైర్యం సాహసాలను ప్రదర్శించింది. యువతిగా, కుల- లైంగిక వేధింపుల నుండి మహిళలు, పిల్లలను రక్షించడానికి మహాబిరి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. మహాబిరి దాని సభ్యులకు ఆయుధాలు, గుర్రపు స్వారీలో శిక్షణ ఇచ్చారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభమైనప్పుడు, బహుజన మహిళల మహాబిరి సైన్యం బ్రిటిష్ శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ క్రమంలోనే బ్రిటిష్ సైన్యం ఆమెను పట్టుకుని కాల్చి చంపింది.
ఝల్కారీ దేవి భర్త ఝాన్సీ రాణి లక్ష్మీబాయి సైన్యంలో ఒక సైనికుడు. గుర్రాలను స్వారీ చేయడం, కుస్తీ పట్టడం, కాల్పులు జరపడం వంటివి తన భర్త నుంచి నేర్చుకుంది. రాణి దుర్గా దళ్ అనే మహిళా సైన్యాన్ని నిర్వహించడానికి ఝల్కారీని నియమించింది. ఝాన్సీ కోటను ముట్టడించినప్పుడు, ఝల్కారీ రాణి తప్పించుకోవడానికి సహాయం చేసింది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించింది.
ఉదా దేవి పాసి కమ్యూనిటీకి చెందినది. 1857 నాటి ప్రముఖ నాయకులలో ఒకరైన ఔద్ రాణి బేగం హజ్రత్ మహల్‌తో సంబంధం కలిగి ఉన్నారు. బేగం కోసం మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేయడంలో ఉదా ముందంజలో ఉన్నారు. ఈస్టిండియా కంపెనీ సైన్యం సికందర్ బాగ్‌పై దాడి చేసినప్పుడు, ఉదా దేవి బేగంతో కలిసి పోరాడింది.