Onion Prices : కోయకుండానే కంటనీరు పెట్టిస్తున్న ఉల్లి
పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. వందరూపాయలకు కిలో అవ్వడంతో కొనలేకపోతున్నారు.
పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. వందరూపాయలకు కిలో అవ్వడంతో కొనలేకపోతున్నారు. దీంతో మెహదీపట్నం రైతు బజార్ లో ప్రభుత్వం ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో 40 రూ.లకు కిలో అని చెప్పడంతో జనాలు బారులు తీరారు. అయితే స్టాల్ ప్రారంభించడానికి రావాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పార్థసారధి రావడం ఆలస్యం అవ్వడంతో కజనాలు కోపోద్రిక్తులయ్యారు. గంటలకొద్దీ నిలబడ్డా స్టాల్ తెరవకపోవడంతో కట్టిన రిబ్బన్లను తెంచేసి ఉల్లిగడ్డలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.