Asianet News TeluguAsianet News Telugu

మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన నీతి అయోగ్ సీఈవో

హైదరాబాద్ నగరం పైన,  మంత్రి కేటీఆర్ పైన  నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రశంసల వర్షం కురిపించారు.

హైదరాబాద్ నగరం పైన,  మంత్రి కేటీఆర్ పైన  నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రశంసల వర్షం కురిపించారు.

శుక్రవారం మైక్రాన్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన కాంత్, హైదరాబాద్ నగరం గత ఐదు సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఈ మార్పుకి నాయకత్వం వహించిన మంత్రి కేటీఆర్ కి ఆయన అభినందనలు తెలియజేశారు.

మైక్రాన్ తన డెవలప్మెంట్ సెంటర్ ఎర్పాటు కోసం హైదరాబాద్ కి మించిన నగరం ఏది లేదన్న ఆయన.. ఇక్కడ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు పరిశోధన, సేవల అభివృద్ధి, ఆవిష్కరణలను హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నాయని గుర్తు చేశారు.

ప్రస్తుతం 18 దేశాల నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో మైక్రాన్ సంస్థ భవిష్యత్తు అంతా భారతదేశం నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచే ఉంటుందనడంలో అతిశయోక్తి అమితాబ్ తెలిపారు.

ఇక్కడ సెమి కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఐటి పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన ఈకో సిస్టమ్ సిద్ధంగా ఉందని అమితాబ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో నెలకొన్న ఐఐటి, ఐఐఐటి, మరియు ఉన్నత విద్యా ప్రమాణాలున్న ఇంజనీరింగ్ కాలేజీలు నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నారని నీతి అయోగ్ సీఈవో తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టాప్ సెమి కండక్టర్ కంపెనీ మైక్రాన్ హైదరాబాద్ లో తమ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.

ఇప్పటికే హైదరాబాద్ లో రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఉన్నాయని, ఇక్కడ ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలున్నాయని మంత్రి వెల్లడించారు. మైక్రాన్ తో కలిసి మరిన్ని సెమి కండక్టర్ కంపెనీలను హైదరాబాద్ కి తీసుకురావడానికి కృషి చేస్తామని వెల్లడించారు.