దిల్ షుక్ నగర్ సాయిబాబా గుడిలో కవిత ప్రత్యేక పూజలు
హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయిబాబా ఆలయానికి వచ్చిన ఐఎస్ఓ సర్టిఫికేట్ ను ఆలయ కమిటీకి అందజేశారు. భక్తులకు వసతుల కల్పన, ప్రసాదానికి సంబంధించి, సాయిబాబా టెంపుల్ కు ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం గొప్ప విషయమని కవిత అన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.