Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు మెజారిటీ పదివేలు కాదు 25వేలు... ఎలాగంటారా?: వినోద్ ఆసక్తికర వ్యాఖ్యలు

వేములవాడ : మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిందని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ పేర్కొన్నారు.

First Published Nov 7, 2022, 5:00 PM IST | Last Updated Nov 7, 2022, 5:10 PM IST

వేములవాడ : మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిందని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ పేర్కొన్నారు. ఓడిపోయిన అభ్యర్థిపై వచ్చిన మెజారిటీ కంటే గత అసెంబ్లీల కంటే ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు 25వేల ఓట్లు అధికంగా వచ్చాయని... ఈ మెజారిటే బ్రహ్మాండమన్నారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పై చూపించిన నమ్మకానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ గెలుపుకోసం వేములవాడ, సిరిసిల్ల టీఆర్ఎస్ నాయకులు కూడా చాలా కృషిచేసారని... వారందరితో కలిసి వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు వినోద్ వెల్లడించారు. 

కార్తిక పౌర్ణమి సందర్భంగా వినోద్ సతీసమేతంగా వేములవాడ ఆలయానికి చేరుకోగా అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు వినోద్ దంపతులు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా అలయ అర్చకులు వినోద్ దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. BJP Leader Boinipally Vinod Comments on Munugode Bypoll Result