Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో బెజవాడ తరహా గ్యాంగ్ వార్  ఏరులై పారిన రక్తం (చూడండి)

హైదరాబాదు సమీపంలోని దిండిగల్ వద్ద గ్యాంగ్ వార్ లాంటి సంఘటన జరిగింది. ఓ వ్యక్తి కత్తితో మరో యువకుడిపై దాడి చేశాడు. 

హైదరాబాదు సమీపంలోని దిండిగల్ వద్ద గ్యాంగ్ వార్ లాంటి సంఘటన జరిగింది. ఓ వ్యక్తి కత్తితో మరో యువకుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో యువకుడి చేయి కొంత మేరకు తెగింది. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. కొంత మంది ఆ దాడి ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆర్థిక లావాదేవీలే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు. మిత్రుల మధ్యనే ఆర్థిక వ్యవహారాలు దాడికి కారణమైనట్లు చెబుతున్నారు.