మీరు పర్ఫెక్ట్‌గా ధ్యానం చేస్తున్నారా: ‘‘ ధ్యాన రింగ్ ’’ కావాల్సిందే (వీడియో)
మనలో చాలా మంది ధ్యానం గురించి వినే వుంటారు. అది మన మనస్సు మరియు శరీరాన్ని శాంతపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీని గురించి తెలిసి కూడా ధ్యానం వైపు మన మనస్సు కేంద్రీకరించలేకపోతున్నాం
మనలో చాలా మంది ధ్యానం గురించి వినే వుంటారు. అది మన మనస్సు మరియు శరీరాన్ని శాంతపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీని గురించి తెలిసి కూడా ధ్యానం వైపు మన మనస్సు కేంద్రీకరించలేకపోతున్నాం. కోవిడ్ మహమ్మారి ఆందోళనలు ఉన్న సమయంలో, ధ్యానానికి సహాయపడేందుకు ఒక గైడ్ దొరికారు,
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ అంతర్దృష్టులతో అభివృద్ధి చేసిన 'ధ్యాన రింగ్' మీకు పరిష్కారం చూపుతుంది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ అవంతరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన 'ధ్యాన రింగ్'.. శ్వాస, రెస్ట్ ,హృదయ స్పందనల వ్యత్యాసాలను గుర్తించే అల్గారిథమ్‌లతో దృష్టి పెట్టడం ద్వారా ధ్యానం చేసేవారి పనితీరును ట్రాక్ చేస్తుంది.
6999 రూపాయల ధరగా ఉన్న 'ధ్యాన రింగ్', మీరు ఎంత బాగా ఊపిరి, విశ్రాంతి, ఫోకస్ చేస్తున్నారో విశ్లేషిస్తుంది. మీరు ధ్యానం చేసేటప్పుడు మొబైల్ స్క్రీన్‌పై తక్షణ అభిప్రాయాన్ని , సూచనలను అందిస్తుంది. దీనితో పాటు మీ ధ్యానం ముగిసిన తర్వాత నివేదికను సైతం ఇస్తుంది.
అసలు ధ్యానారింగ్ అంటే ఏమిటో..? అది ఎలా పనిచేస్తుందో పుల్లెల గోపీచంద్ మాటల్లోనే...