Asianet News TeluguAsianet News Telugu

Video: అమరావతిలో కొనసాగుతున్న అరెస్టులు... డీఎస్పీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న నిరసనలకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు కొరేందుకు తుళ్లూరుకు చెందిన కొందరు 13 జిల్లాల యాత్ర చేయాలని భావించారు. ఈ మేరకు తుళ్లూరు నుండి బయలుదేరిన మహిళలు, రైతులను కరకట్టపై స్థానిక డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సిబ్బందితో కలిసి వెంకటపాలెం కరకట్టపై అడ్డుకున్నారు. ఎటువంటి యాత్రలకు అనుమతి లేదంటూ దాదాపు 30మందిని అదుపులకి తీసుకుని మందడంలోకి డీఎస్పీ ఆఫీస్ కి తరలించారు. 

ఈ విషయం గురించి తెలుసుకున్న స్థానికులు భారీ ఎత్తున డీఎస్పీ ఆఫీస్ వద్దకి చేరుకున్న ఆందోళన చేపట్టారు. వెంటనే అదుపులోకి తీసుకున్న రైతులు, మహిళల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ వారిని ఎందుకు అక్రమంగా అరెస్ట్  చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేమెమన్న ఉగ్రవాదులమా అంటూ డీఎస్పీ ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు.