నేడే మృగశిర కార్తె .. ఎందుకంత ప్రాముఖ్యం అంటే...

సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. 

First Published Jun 8, 2020, 3:00 PM IST | Last Updated Jun 8, 2020, 4:43 PM IST

సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. ఈ టైంలో దేశంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వాతావరణం చల్లబడుతుంది. ఫలితంగా ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఆరోగ్యానికి హాని చేసే క్రిములు, కీటకాలు ఉత్పత్తి అవుతాయి. రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అందుకే మృగశిర కార్తెలో ప్రజలు రోగనిరోధక శక్తిని అందించే ఆహారాన్ని తీసుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా ఈ కార్తె ప్రారంభం రోజున మాంసం ప్రియులు చేపలు తినడానికి ఆసక్తి చూపుతారు. ఇన్ని రోజులు వేసవి కారణంగా మన శరీరం కూడా వేడిగా ఉంటుందని, చేపలు తినడం వల్ల ఆ వేడి తగ్గుతుందని నమ్మకం.