Asianet News TeluguAsianet News Telugu

video news : ప్లాంట్ బేస్డ్ డైట్ చేస్తున్నారా...అయితే ఇది మీకోసమే...

మంచి ఆరోగ్యం కోసం అనేకమంది ప్లాంట్ బేస్డ్ డైట్ ను అనుసరిస్తున్నారు. అయితే దీనివల్ల వారు ఆశించిన పూర్తి ఫలితాలు పొందలేకపోతున్నారట. దీనికి కారణం ఈ డైట్ లో భాగంగా వారు తీసుకునే కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు...లాంటి వాటిల్లో అన్నీ ఆరోగ్యానికి మంచి చేసేవి కాకపోవడమేనట.

First Published Nov 5, 2019, 11:29 AM IST | Last Updated Nov 5, 2019, 11:29 AM IST

మంచి ఆరోగ్యం కోసం అనేకమంది ప్లాంట్ బేస్డ్ డైట్ ను అనుసరిస్తున్నారు. అయితే దీనివల్ల వారు ఆశించిన పూర్తి ఫలితాలు పొందలేకపోతున్నారట. దీనికి కారణం ఈ డైట్ లో భాగంగా వారు తీసుకునే కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు...లాంటి వాటిల్లో అన్నీ ఆరోగ్యానికి మంచి చేసేవి కాకపోవడమేనట.

ఈ ప్లాంట్ బేస్డ్ డైట్ కి అన్నిరకాల మొక్కలు అంతమంచివి కావని ఇటీవలి ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా పోషకాహరలోపంలో ఉండేవాళ్లు, సింగిల్ ప్లాంట్ డైట్ చేసేవాళ్లకు ఇదస్సలు మంచిది కాదని పరిశోధకులు అంటున్నారు. అంతేకాదు సంపన్నదేశాల్లో వైల్డ్ ఎడిబుల్స్ మీద పెరుగుతున్న ఆసక్తి కూడా అంతమంచిదికాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని మొక్కలు వాతావరణమార్పుల్లో భాగంగా విషపూరితంగా మారతాయని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కొన్నిరకాల మొక్కలను తినడం వల్ల ముందే పోషకాహారలోపంతో ఉన్న కొంతమంది అనారోగ్యంభారిన పడడం, చనిపోవడం జరిగిందని ఈ అధ్యయనంలో తేలింది. వాటి వివరాలు కూడా తమ అధ్యయనంలో పొందుపరిచారు. అవేంటంటే

న్యూరోటాక్సిక్ ప్రభావం ఎక్కువగా ఉండే అకీ చెట్టు పండ్లు. ఇవి పశ్చిమ ఆఫ్రికా, జమైకాల్లో ఎక్కువగా దొరుకుతాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ఇష్టంగా తింటున్న లిచీ పండు. ఇది దక్షిణాసియాలో పండే ట్రోపికల్ ఫ్రూట్. అధిక ప్రోటీన్లుండే గ్రాస్ పీ అనే ఒకరకమైన పప్పుదినుసు. దీన్ని మనదేశంలోనూ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా తింటారు. కసావా అనే ఓ రకమైన మొక్క. దీని ఆకులు, వేర్లను ఆఫ్రికా సబ్ సహారా ప్రాంతంలో ఎక్కువగా తింటారు. 

ఇవి చాలా తొందరగా మెదడు పనితీరుపై ప్రాణాంతక ప్రభావాన్ని చూపిస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ముఖ్యంగా కసావా, గ్రాస్-పీ తీసుకునేవాళ్లు అంగవైకల్యం భారిన పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. 

ఆరోగ్యం సరిగా లేనివాళ్లు ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం, పేదరికం వల్ల, ఆకలిని తట్టుకోలేక ఇలాంటి ఎడిబుల్ ప్లాంట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు తేల్చారు.