Asianet News TeluguAsianet News Telugu

కల్తీ తేనె గుట్టు బట్టబయలు: ఏ కంపెనీల తేనె మంచిదంటే..!

తేనె అంటే ఇష్టపడని వారుండరు. హెల్త్ కాన్షియస్ ప్రజల్లో బాగా పెరిగిన తరువాత యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయని తేనె వాడకం మరింతగా పెరిగింది. 

తేనె అంటే ఇష్టపడని వారుండరు. హెల్త్ కాన్షియస్ ప్రజల్లో బాగా పెరిగిన తరువాత యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయని తేనె వాడకం మరింతగా పెరిగింది. దీనితో తేనెలో కల్తీ కూడా అదే స్థాయిలో పెరిగిపోయినందు. ఆరంభంలో చెక్కెర పాకం కలుపుతుండడంతో.... దానిని గుర్తించడానికి ఫుడ్ స్టాండర్డ్ అథారిటీ పరీక్షలను రూపొందించింది. దానితో కంపెనీలు వాటిల్లో దొరకకుండా ఏర్పాట్లు చేసుకొని మనకు కల్తీ తేనెను అంటగడుతున్నారు. తేనెలో చైనా షుగర్ కలిపి కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఇవేవో చిన్నా చితకా కంపెనీలు అనుకునేరు, డాబర్ నుండి పతంజలి వరకు అన్ని కంపెనీలది ఇదే దారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) చేసిన ఓ అధ్యయనం వెల్లడించింది.