మా చేతుల్తో వచ్చాడు, మా కళ్ల ముందే వెళ్లిపోయాడు: ఎస్వీ కృష్ణారెడ్డి (వీడియో)
వేణుమాధవ్ మృతిపై దర్శకుడు యస్వీకృష్టారెడ్డి, అచ్చిరెడ్డి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాము ఎంకరేజ్ చేసిన నటుడు తమతో అనుబంధం ఉన్న నటుడు ఇలా అకాలమరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఎంకరేజ్ చేద్దామని సంప్రదాయం సినిమాలో అవకాశం ఇచ్చానన్నారు యస్వీ కృష్ణారెడ్డి. కట్టుకున్న ప్రతి ఇంటికి అచ్చివచ్చని క్రిష్ణనిలయం అని పెట్టుకున్నాడంటే అతని కృతజ్ఞతకు నా జోహార్లు అంటూ కంటనీరు పెట్టుకున్నారాయన.స్టార్ కమెడియన్ అయినా అందరితో వినమ్రంగా ఉండేవాడు వేణుమాధవ్. అతనిలోని టాలెంట్ కంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అతన్ని మంచి ఆర్టిస్టును చేసిందన్నాడు అచ్చిరెడ్డి.