ప్రాజెక్ట్ కవచ్ తో కరోనా వైరస్ కి చెక్.. ఎలాగో చెబుతున్న ఉపాసన
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిందే ప్రాజెక్ట్ కవచ్ అని దీన్ని తన తాతగారు తయారు చేశారని.. కవచ్ గురించి వివరిస్తోంది ఉపాసన కొణిదల.
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిందే ప్రాజెక్ట్ కవచ్ అని దీన్ని తన తాతగారు తయారు చేశారని.. కవచ్ గురించి వివరిస్తోంది ఉపాసన కొణిదల. ప్రాజెక్ట్ కవచ్ పేరిట.. ఒక ప్రణాళిక, సమాచారం, స్ర్కీనింగ్, పరీక్షలు చికిత్సకు కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అపోలో ఆస్పత్రి ప్రకటించింది. తొలుత 250 పడకలతో ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తీసుకొస్తామని, అవసరాల మేరకు సంఖ్యను పెంచుతామని తెలిపారు. కరోనా బాధితుల్లో 15 శాతం మాత్రమే క్లిష్టమైన రోగులు ఉంటారని, వీరికి తగిన సదుపాయాలు కల్పిస్తామన్నారు.