Asianet News TeluguAsianet News Telugu

రూల్స్ బ్రేక్ చేసిన బన్నీ.. షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు (వీడియో)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన కేసులో బన్నీకి జరిమానా విధించారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల హిమాయత్ సాగర్ ప్రాంతంలో అబ్దుల్ ఆజం అనే వాహనదారుడు టీఎస్09ఎఫ్‌జీ 0666 నంబర్‌ గల వాహనాన్ని గుర్తించాడు. 

ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రత్యేకంగా వెళుతున్న ఆ వాహనాన్ని గమనించాడు. క్యారవాన్ అద్దాలు పూర్తిగా బ్లాక్ షేడ్ తో కప్పబడి ఉన్నాయి. రాష్ట్రంలో బ్లాక్ షేడ్ ఉన్న అద్దాలపై నిషేధం ఉంది. అది గమనించిన అబ్దుల్ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. 

శంషాబాద్ పోలీసులు ఆ వాహనం నంబర్ పై విచారణ చేయగా అల్లు అర్జున్ కు చెందిన వెహికల్ అని తేలింది. దీనితో పోలీసులు బన్నీ రూ. 735 జరిమానా విధించారు.