బ్రేకింగ్: హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలుగు సినీ హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 

First Published Dec 29, 2020, 1:35 PM IST | Last Updated Dec 29, 2020, 1:35 PM IST

హైదరాబాద్: తెలుగు సినీ హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గత రెండు రోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. రామ్ చరణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. అయితే తనకు కోవిడ్ లక్షణాలు ఏవీ లేవని కూడా చెప్పారు.మంగళవారం ఉదయం రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న విషయాన్ని త్వరలో తాను తెలియజేస్తానని ఆయన చెప్పారు.