కృష్ణ చక్కని రూపసే కాదు ప్రయోగాల సాహసి... జనం మనిషే కాదు మహా మనీషి: సాయికుమార్

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపిన సూపర్ స్టార్ కృష్ణ మరణంపై హీరోలు సాయికుమార్, సుమన్ దిగ్భాంత్రి వ్యక్తం చేసారు.

First Published Nov 15, 2022, 11:19 AM IST | Last Updated Nov 15, 2022, 11:19 AM IST

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపిన సూపర్ స్టార్ కృష్ణ మరణంపై హీరోలు సాయికుమార్, సుమన్ దిగ్భాంత్రి వ్యక్తం చేసారు. ఈ హీరోలిద్దరు సహచర నటుడు కృష్ణ మృతికి సంతాపం తెలిపి ఘట్టమనేని కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.  సాయికుమార్ కాస్త భావోద్వేగానికి లోనయి కృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. '' ఆయన ఒక పరంపర... ఒక సంచలనం... రికార్డుల గని... నిర్మాతల హీరో....చక్కని రూపసి, ఎన్నో ప్రయోగాలు చేసిన సాహసి... జనం మనిషి, అందరూ మెచ్చే నచ్చే మహా మనీషి... ఆయనే మన డేరింగ్ ఆండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ. కృష్ణగారి కథ ఓ చరిత్ర... కథ మాత్రమే ఈరోజు ఆగింది చరిత్ర మాత్రం ఎప్పటికీ సువర్ణాక్షరాలతో వెండితెరపై నిలిచేవుంటుంది.. మన గుండెల్లో వుంటుంది. కృష్ణ గారి కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతున్ని కోరుకుంటున్నా... ఆయన ఆత్మకు శాంతి కలగాలి'' అంటూ కృష్ణ మరణంపై సాయికుమార్ ఓ వీడియో విడుదల చేసారు.