మొక్కలు దత్తత తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్

రాజ్యసభ సభ్యులు, తెరాస నేత జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' స్పూర్తితో హీరోయిన్ సోనీ చరిష్ఠ మొక్కను నాటారు.  

First Published Jul 3, 2020, 10:51 AM IST | Last Updated Jul 3, 2020, 10:51 AM IST

రాజ్యసభ సభ్యులు, తెరాస నేత జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' స్పూర్తితో హీరోయిన్ సోనీ చరిష్ఠ మొక్కను నాటారు.  ప్లీజ్ నాకు పెళ్లైంది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన  నేపాలీ బ్యూటీ సోనీ చరిష్ట. యుగళగీతం, ప్రేమ ఒక మైకం, మిస్టర్ రాజేష్, నాకైతే నచ్చింది, టాప్ ర్యాంకర్స్ లాంటి సినిమాల్లో నటించి ప్రస్తుతం బాలీవుడ్ లో అడుగుపెట్టింది.  హరితహారంలో భాగంగా... జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' స్పూర్తితో మొక్క నాటడమే కాకుండా, మరికొన్ని మొక్కల్ని దత్తత తీసుకుని వాటి సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నానని సోనీ చరిష్ఠ పేర్కొన్నారు.