Asianet News TeluguAsianet News Telugu

బాలకృష్ణ ను పిలవాల్సిన అవసరం లేదు.. తమ్మారెడ్డి భరద్వాజ

తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా చోటు చేసుకున్న వివాదంపై తెలుగు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు వర్ధంతి సభలో మాట్లాడారు.

తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా చోటు చేసుకున్న వివాదంపై తెలుగు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు వర్ధంతి సభలో మాట్లాడారు. దాసరి నారాయణ రావు గతంలో చాలా సమావేశాలు నిర్వహించారని, అప్పుడు ఏ విధమైన వివాదాలు కూడా చోటు చేసుకోలేదని, దాసరి నిర్వహించినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు చిరంజీవి నివాసంలో జరిగే సమావేశాలకు ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారని ఆయన అడిగారు. చిరంజీవి, బాలకృష్ణలతో మాట్లాడామని, సమస్య సద్దుమణిగిందనే అనుకుంటున్నామని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ కోసమే చిరంజీవి నివాసంలో సమావేశాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.