Asianet News TeluguAsianet News Telugu

సుమంత్ అశ్విన్ కొత్త చిత్రం ప్రారంభం!

నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్ల దూరం రోడ్డుపై ప్రయాణం.. వాళ్ల ప్రయాణం దేనికోసం.. ఆ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేమిటి?.. 

నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్ల దూరం రోడ్డుపై ప్రయాణం.. వాళ్ల ప్రయాణం దేనికోసం.. ఆ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేమిటి?.. ఈ కథాంశంతో గురుప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా ఒక చిత్రాన్ని ప్రారంభించారు నిర్మాత జి. మహేష్. నలుగురు అపరిచితులుగా సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని నటిస్తున్నారు. గురుపవన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. 

Video Top Stories