బాల సుబ్రహ్మణ్యం కరోనా నెగటివ్.. అవి వట్టి పుకార్లే...
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించాడని ఉదయం నుండి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కుమారుడు చరణ్ స్వయంగా తెలిపారు.
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించాడని ఉదయం నుండి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కుమారుడు చరణ్ స్వయంగా తెలిపారు. నాన్న ఆరోగ్యం గురించి తాను మాత్రమే అఫీషియల్ గా సమాచారం ఇస్తున్నానని, అయితే ఈ రోజు ఉదయం నుండి నెగటివ్ అనే పుకార్లు ఎలా వచ్చాయో తెలియదని ఆయన అన్నారు. ఎస్పీబీ పరిస్థితి ఇప్పుడూ అలాగే ఉందని, కాకపోతే స్థిరంగా ఉందని తెలిపారు. అంతేకాదు ఈ సాయంత్రం లోగా డాక్టర్లతో మాట్లాడి బాలు ఆరోగ్యం మీద బులెటిన్ విడుదట చేస్తానని చెప్పారు. ఇటీవల కొవిడ్ పాజిటివ్ రావడంతో ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.