వాళ్లకు మరింత శక్తని ఇవ్వమని దేవుడ్ని కోరుకుంటున్నా.. రకుల్ ప్రీత్ సింగ్
కరోనాపాజిటివ్ నుండి కోలుకుని తిరిగి విధుల్లో చేరిన పోలీసులను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొనియాడారు.
కరోనాపాజిటివ్ నుండి కోలుకుని తిరిగి విధుల్లో చేరిన పోలీసులను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొనియాడారు. వారికి మరింత శక్తినివ్వమని భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు. కరోనా లాక్ డౌన్ వేళ మనమందరం ఇంటికే పరిమితమైనప్పుడు 24గంటలూ విధులు నిర్వహించారు పోలీసులు. దాంట్లో భాగంగా ఎంతోమంది పోలీసులు కరోనా బారిన పడ్డారని వారిలో 390మంది పోలీసులు కరోనానుండి కోలుకుని విధుల్లో చేరినట్టు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారన్నారామె.