నిస్సహాయతతో ఎదురు చూడాల్సిందే.. షూటింగ్స్‌పై పవన్ కల్యాణ్..

షూటింగ్స్ ఎప్పుడుమొదలవుతాయన్న దానిపై జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. 

First Published Jul 26, 2020, 10:38 AM IST | Last Updated Jul 26, 2020, 10:38 AM IST

షూటింగ్స్ ఎప్పుడుమొదలవుతాయన్న దానిపై జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్‌గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే..’’ అని తెలిపారు.