నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు.
ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్ హైదరాబాద్ సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలు సినిమాల్లో కామెడీ, విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన నర్సింగ్ యాదవ్.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 300 చిత్రాల్లో నటించారు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు బాగా ఫేమస్. నర్సింగ్ యాదవ్ మరణంపై తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.