Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ వీడియో : పెద్ద కొడుకులా ఆదుకుంటా...మెగా ఫ్యాన్ నూర్ భాయ్ కుటుంబానికి హామీ...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ద హృదయాన్ని చాటుకున్నాడు.
 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ద హృదయాన్ని చాటుకున్నాడు. కొద్దికాలం క్రితం హార్ట్ ఎటాక్ తో చనిపోయిన తమ మెగా అభిమాని నూర్ మహ్మద్ కుటుంబానికి పదిలక్షలు అందిచ్చారు. నూర్ మహ్మద్ మరణవార్త వినగానే మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅర్జున్ లు సికింద్రాబాద్ లోని తన నివాసానికి వెళ్లి చూశారు. ఆ తరువాత రామ్ చరణ్ నూర్ మహ్మద్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చాడు. అన్నట్టుగానే ఈ ఆదివారం నూర్ మహ్మద్ కుటుంబాన్ని తన నివాసాని పిలిపించుకుని పదిలక్షల రూపాయల చెక్ అందజేశాడు. ఆయన తమ కుటుంబానికి చేసిన సేవలు మరిచిపోలేనివని, తాను చేస్తున్న సాయం చాలా చిన్నదని, కుటుంబానికి పెద్ద కొడుకులా ఉంటానని హామీ ఇచ్చాడు. అమ్మాయిల పెళిళ్లు, అబ్బాయి ఉద్యోగ బాధ్యత కూడా తనదేనని చెప్పాడు. దాదాపు 45 ని.లపాటు వారితో రామ్ చరణ్ గడిపాడు. 

Video Top Stories