Asianet News TeluguAsianet News Telugu

MAA Dairy Launch : దివిసీన ఉప్పెన సమయంలో శవాల మధ్య తిరిగాం...

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిజిటల్ డైరీ ఆవిష్కరణ గురువారం జరిగింది. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిజిటల్ డైరీ ఆవిష్కరణ గురువారం జరిగింది. మా గౌరవ సభ్యులు రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్అని మొదట్లో దీన్ని ప్రారంభించాం. దివిసీన ఉప్పెన సమయంలో కృష్ణ, నేను కొంతమందిమి బస్సులు వేసుకుని వెళ్లి సాయం చేశాం. శవాలమధ్య తిరిగి, వారితో మాట్లాడి సాయమందించాం.. అప్పుడు వారికి నటులమీద గౌరవం పెరిగింది. ఇందులో ఉన్నవాళ్లందరం నేను, నాది అని కాకుండా మా, మనది అనుకుని అందరూ కలిసి చేయాలని కోరారు.