క్రాక్ సినిమా విడుదలకు బ్రేక్: థియేటర్ల వద్ద అభిమానుల నిరుత్సాహం

రవితేజ క్రాక్ మూవీ నేడు గ్రాండ్ ఆ విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది.

First Published Jan 9, 2021, 11:08 AM IST | Last Updated Jan 9, 2021, 11:08 AM IST

రవితేజ క్రాక్ మూవీ నేడు గ్రాండ్ ఆ విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ షోల ప్రదర్శన నిలిచిపోయింది. ఉదయం షో బుక్ చేసుకున్న ప్రేక్షకులకు క్రాక్ సినిమా ప్రదర్శన లేదని సందేశం రావడం జరిగింది. అలాగే నేడు ఈ మూవీ ప్రదర్శన కష్టమే అన్న మాట వినిపిస్తుంది. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న మొదటి చిత్రం క్రాక్ ఇలా ఆర్థిక ఇబ్బందుల కారణం విడుదల నిలిచిపోవడం రవితేజ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులను తీవ్ర నిరాశకు గురి చేసింది.