Asianet News TeluguAsianet News Telugu

తెలుగులో ఇలాంటి థ్రిల్లర్ రాలేదు : విశ్వక్ సేన్

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'హిట్‌'.

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'హిట్‌'. 'ది ఫ‌స్ట్ కేస్‌' ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 28న ఈ సినిమా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రి రిలీజ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది.