సిద్ధిపేటలో హీరో శ్రీకాంత్ సందడి.. కరోనా లేకపోవడంపై...
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో సినీ హీరో శ్రీకాంత్ సందడి చేశారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో సినీ హీరో శ్రీకాంత్ సందడి చేశారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మారుమూల గ్రామంలో మంచి విశిష్టత కలిగిన ఆలయం ఉండడం సంతోషకరమన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భూతం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఇక్కడ ఒక్క కరోనా కేసు లేకపోవడం సంతోషం అన్నారు. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి,
బౌతిక దూరం పాటించాలని సూచించారు. స్వీయ నియంత్రణే మనకు ఇప్పుడు అవసరమన్నారు. మోతే గ్రామంలోని చల్లటి వాతావరణం చూసి ఆనందం వ్యక్తం చేశారు.