గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0 : పార్కును దత్తత తీసుకున్న శర్వానంద్..

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వయంగా స్వీకరించి బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన పార్క్ లో హీరో శర్వానంద్ మొక్కలు నాటారు. 

First Published Jul 13, 2020, 4:38 PM IST | Last Updated Jul 13, 2020, 4:38 PM IST

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వయంగా స్వీకరించి బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన పార్క్ లో హీరో శర్వానంద్ మొక్కలు నాటారు. ఆ పార్కును దత్తత తీసుకున్నట్టుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లతో కలిసి మొక్కలు నాటారు.  సంతోష్ అన్న చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక గొప్ప కార్యక్రమం అని, దానికి ఇన్స్పైర్ అయి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నానన్నారు.  ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కి అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట, వంశీ, విక్కీ, ప్రమోద్, సుధాకర్ చెరుకూరిలకు చాలెంజ్ ఇచ్చారు.