కనబడుటలేదు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సత్యదేవ్..
బాలరాజు దర్శకత్వంలో లవ్ అండ్ సస్పెన్స్, థ్రిల్లర్ స్టోరీగా వస్తున్న కనబడుట లేదు మూవీ ఫస్ట్ లుక్ ను హీరో సత్యదేవ్ లాంఛ్ చేశారు.
బాలరాజు దర్శకత్వంలో లవ్ అండ్ సస్పెన్స్, థ్రిల్లర్ స్టోరీగా వస్తున్న కనబడుట లేదు మూవీ ఫస్ట్ లుక్ ను హీరో సత్యదేవ్ లాంఛ్ చేశారు. సుక్రాంత్ వీరెళ్ల హీరోగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అయితే భయపెట్టే విధంగానే ఉందని సత్యదేవ్ అన్నారు. డైరెక్టర్ బాలరాజుతో తాను ఇంతకు ముందే సినిమా చేయాల్సి ఉందని అనుకోని కారణాల వల్ల వాయిదా పడిందని సత్యదేవ్ తెలిపారు. యుగ్ రామ్, శశిత కోన, నీలిమ పెతకంశెట్టి, సౌమ్య శెట్టి, ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ రాజు, ఉమామహేశ్వరరావు, కిశోర్, శ్యామ్, మధు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.