షంషేరా మూవీ టీం తో ఏషియానెట్ న్యూస్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న విజువల్‌ వండర్‌ `షంషేరా`. సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో, వాణి కపూర్ కథానాయికగా నటించిన చిత్రమిది. 

First Published Jul 20, 2022, 5:55 PM IST | Last Updated Jul 20, 2022, 6:13 PM IST

రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న విజువల్‌ వండర్‌ `షంషేరా`. సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో, వాణి కపూర్ కథానాయికగా నటించిన చిత్రమిది. 1871నేపథ్యంలో బ్రిటీష్‌ కాలం నాటి పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించగా, యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. భారీ బడ్జెట్‌తో లార్జ్ స్కేల్‌లో హిందీలో తెరకెక్కించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ నెల జులై22న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అనేక ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.