Asianet News TeluguAsianet News Telugu

వారే లేకపోతే సినీ కార్మికుల ఆకలి చావులు చూడాల్సి వచ్చేది.. బెనర్జీ

ఈ కరోనా టైంలో సీసీసీ వ‌ల్ల‌నే కడుపునిండా తిన గలుగుతున్నామంటున్నారు అందరూ అనీ నటుడు బెన‌ర్జీ అన్నారు.

ఈ కరోనా టైంలో సీసీసీ వ‌ల్ల‌నే కడుపునిండా తిన గలుగుతున్నామంటున్నారు అందరూ అనీ నటుడుబెన‌ర్జీఅన్నారు. దాతలందరి వల్లే సినీకార్మికుల ఆకలిచావులు లేకుండా ఉన్నాయని కృతజ్ఞతలు తెలిపారు. ఇది సినీప‌రిశ్ర‌మ‌కు, సినీకార్మికుల‌కు క‌ష్ట‌కాలం. ఉపాధి లేక బ‌తుకు తెరువు లేక ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌య‌మిది. ఇలాంటి స‌మ‌యంలో మెగాస్టార్ ప్రారంభించిన క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)వేలాది కార్మికుల్ని ఆదుకుంది. ఇప్ప‌టికే ఒక ద‌ఫా నిత్యావ‌స‌ర స‌రుకుల్ని పంపిణీ చేసి ఆదుకున్నారు.రెండో ద‌ఫా నిత్యావ‌స‌రాల్ని సీసీసీ క‌మిటీ స‌ర‌ఫ‌రా చేస్తోంది. మా స‌భ్యులకు కొంతమందికి గురువారంరెండో ద‌ఫా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మూవీ ఆర్టిస్టుల సంఘం ఉపాధ్య‌క్షురాలు హేమ‌, కమిటీ స‌భ్యులు ఏడిద శ్రీ‌రామ్, సురేష్ కొండేటి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Video Top Stories