మీలాంటి ప్రధాని దొరకడం మా అదృష్టం .. కంగనా రనౌత్
ప్రధాని మోడీ 70 వ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన విషేస్ తెలియజేసింది.
ప్రధాని మోడీ 70 వ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన విషేస్ తెలియజేసింది. మీతో మాట్లాడే అవకాశం నాకెప్పుడూ రాలేదు.. కేవలం రెండు మూడుసార్లు కలిసినా అది ఫొటోల వరకే పరిమితం అయ్యింది. మీ మీద చాలామంది ఆరోపణలు చేస్తారు. కానీ సామాన్య జనంలో మీ మీద ఉన్న ప్రేమ అపారమైనది.. ఇంత గౌరవం, ఇంత ప్రేమ ఇంతకు ముందు ఏ ప్రధానికీ దక్కలేదు. వారందరూ మీ దీర్ఘాయుష్సు కొరకు ప్రార్థిస్తున్నారు. మీలాంటి ప్రధాని దొరకడం మా అదృష్టం అంటూ తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది కంగనా.