Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ సీజన్ 6 కి క్రికెట్ దెబ్బ... ప్రారంభంరోజే ఇలా అయితే ఎలా..?

బుల్లితెరఆడియన్స్ ను  అలరించేందుకు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-6 రెడీ అయ్యింది. 

First Published Sep 4, 2022, 3:21 PM IST | Last Updated Sep 4, 2022, 3:21 PM IST

బుల్లితెరఆడియన్స్ ను  అలరించేందుకు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-6 రెడీ అయ్యింది.  ఇప్పటికే ఐదు సీజన్లు  సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని... ఆరో సిజన్ ను గ్రాండ్ గా వెల్కం  చెప్పబోతున్నారు. కాని ఈ సీజన్ కు గడ్డుకాలం తప్పేట్టు లేదు. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న  బిగ్ బాస్ సీజన్ 6 కోసం అంతా రెడీ అయ్యింది. గ్రాండ్ ఈవెంట్  కోసం హౌస్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మూడో సీజన్‌ నుంచి బిగ్ బాస్ హోస్ట్ గా బుల్లి తెర ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తోన్న అక్కినేని నాగార్జున ఈసారి కూడా డబుల్‌ డోస్‌ ఫన్‌ అందించేందుకు రెడీ అయ్యారు. ఆదిలోనే హంసపాదు అననట్టు... ఎంతో గ్రాండ్ గా ఓపెనింగ్ చేసుకుంటున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఆరో సీజన్ కు క్రికెట్ గండం తగులు కుంది. ఈరోజు సాయంత్రం గ్రాండ్ ఓపెనింగ్ కు రెడీ అయ్యింది బిగ్ బాస్ 6. కాని అదే టైమ్ లో క్రికెట్ మ్యాచ్... అది కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండటంతో.. పరిస్థితిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.