Asianet News TeluguAsianet News Telugu

మూడు కోట్ల బడ్జెట్ తో 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి'!

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి'. 

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి'. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. సోమవారం ఉదయం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సినిమా కొత్త ట్రైలర్ విడుదల చేశారు. మార్చి 6న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక-నిర్మాతలు ప్రకటించారు.