పోలింగ్ సిబ్బంది సాయంతో...గుంటూరు జిల్లాలో వైసిపి రిగ్గింగ్... వీడియో వైరల్
Apr 8, 2021, 9:02 PM IST
అమరావతి: గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ గ్రామాల్లో అధికారులు, పోలీసులను ఉపయోగించుకుని అధికార వైసిపి రిగ్గింగ్ కు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.
క్రోసూరు మండలం వుయ్యందన గ్రామంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు కలిసి ఏవిధంగా రిగ్గింగ్ చేసుకుంటున్నారో చూడండి అంటూ సోషల్ మీడియాలలో ఓ వీడియో వైరల్ అవుతోంది.